16-01-2026 01:30:45 PM
శబరికి బయలుదేరిన అయ్యప్ప భక్తులు
కుమ్రం భీం ఆసిఫాబాద్( విజయక్రాంతి): 41 రోజుల మండల దీక్ష అనంతరం పట్టణానికి చెందిన పలువురు అయ్యప్ప స్వాములు శబరిమలకు బయలుదేరారు. అంతకుముందు ఆసిఫాబాద్ పట్టణం పెద్ద వాగు సమీపంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో రెబ్బెనకు చెందిన గురుస్వామి సూర్య భాస్కర శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకుడు నాగేశ్వర్ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వాములకు ఇరుముడి కట్టారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మాజీ మార్కెట్ కమిటి చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు గాదెవేణి మల్లేష్ ఆధ్వర్యంలో స్వాములు, భక్తులకు బిక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షుడు విశ్వప్రసాద్, స్వాములు వెంకట్ గౌడ్, చంద్రమోహన్, శ్రవణ్, శ్రీనివాస్, తిరుపతి, ఆలయ కమిటీ అధ్యక్షుడు వేణుగోపాల్, భక్తులు వినాయక్, శ్రీకాంత్, సంతోష్, శ్యామ్, నరేష్తో పాటు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.