22-07-2025 01:15:22 AM
మహంకాళి ఆలయాల్లో భవిష్యవాణి
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 21 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని పాతబస్తీ లో సోమవారం అంబారీపై భవానీ రథయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పలు దేవాలయాల్లో రంగం భవిష్యవాణి కార్యక్రమాలు నిర్వహించారు.
ఉప్తుగూడ మహం కాళి ఆలయం, మీరాలా మండి మహంకాళి ఆలయం, లాల్‌దర్వాజ సింహవాహిని ఆలయాల్లో మాతంగి అనురాధ, స్వర్ణలత ఆధ్వర్యంలో భవిష్యవాణిని వినిపించారు. భవానీ రథయాత్ర చార్మినార్, పత్తర్ గట్టి, నయాపూల్, ఢిల్లీ దర్వాజా మీదుగా సాగింది.