22-07-2025 01:16:35 AM
హైదరాబాద్, జులై 21 (విజయక్రాంతి): కల్లు కంపౌండ్‌లను బంద్ చేస్తే ప్రభుత్వాన్ని నడవనీయమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌ డ్ హెచ్చరించారు. కులవృత్తిని అవమానిం చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని వి మర్శించారు.
సోమవారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో నిషేధించిన బీర్లను తెలంగాణలో అమ్ముతున్నారని, ని యోజకవర్గంలో ఒక్కో ఎమ్మెల్యేకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఇస్తున్నారన్నార ని, దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు నెలవా రీ డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించా రు. లిక్కర్ మాఫీయాకు తలొగ్గి కల్లు గీత వృ త్తిని బంద్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందని ఆరోపించారు. కల్లు, నీరాకు ఔషధ గుణాలు ఉంటాయని, కల్లు కంపౌం డ్ పేదోళ్లకు రిక్రియేషన్ సెంటర్ లాగా ఉంటుందన్నారు.