22-07-2025 01:15:10 AM
సంబంధిత ఫైల్‌పై మంత్రి సీతక్క సంతకం
హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో కొత్త 681 మంది డయాలసిస్ పే షెంట్లకు ప్రభుత్వం చేయూత పెన్షన్ మం జూరు చేసింది. ఈ మేరకు మంత్రి సీతక్క సోమవారం పెన్షన్ మంజూరు చేస్తూ ఫైల్ పై సంతకం చేశారు. గతంలో 4,011 మంది డయాలసిస్ పేషెంట్లకు సామాజిక పెన్షన్లు రాగా, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత 4,029 మంది డయాలసిస్ పే షెంట్లకు చేయూత పెన్షన్లు మంజూరు చేసిం ది. తాజాగా మరో 681 మంది డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్లు మంజూరు చేసింది.
వివి ధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న డయాలసిస్ పేషంట్లను ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వం గుర్తిస్తున్నది. ఆరోగ్యశ్రీ హె ల్త్ కేర్ ట్రస్ట్ గుర్తించిన 681 మంది డయాలసిస్ పేషెంట్ల వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత పెన్షన్లను సెర్ప్ మంజూరు చేస్తున్నది. 681 మంది డయాలసిస్ పేషెంట్లలో, అత్యధికంగా హైదరాబాద్‌లో 629 మంది చికిత్స పొందుతుండగా, మిగిలిన అన్ని జిల్లాల్లో కలిపి 52 మంది పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. వీరు పూర్తిస్థాయిలో పనిచేసుకో లేకపోవడంతో వారి ఆరోగ్య, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేస్తుంది. కొత్త పెన్షన్‌దారులు వచ్చే నెల నుంచి పెన్షన్ అందుకోనున్నారు.