19-01-2026 01:03:54 AM
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
సూర్యాపేట, జనవరి 18 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా గవర్నర్ జా యింట్ సెక్రటరీగా పనిచేస్తున్న భవాని శంక ర్ నియమితులయ్యారు. గతంలో యాదగిరిగుట్ట ఈవోగా పని చేసిన వెంకట్రావు వ్యక్తి గత ఆరోగ్య కారణాలతో ఈ నెల 1న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి ఆలయ ఈవో పోస్టు ఖాళీగా ఉంది. ఈ క్రమంలోనే రాష్ర్ట ప్రభుత్వం తాజాగా ఆలయ ఈవోగా భవాని శంకరును నియమించింది.
అయితే వెంకట్రావు రాజీనామా తర్వాత యాదగిరిగుట్ట ఆలయ ఈ వోగా భువనగిరి అదనపు కలెక్టర్ భాస్కరరా వు బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం జరిగింది. కాగా అప్పటికే ఒకసారి భాస్కర్‌రావు ఈఓగా పని చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఈవోగా భాస్కరరావు నియామకమైతే మరింత గందరగోళం ఏర్పడే అవకాశం ఉం దనే వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు భవాని శంకర్ నియమితులు కావడంతో అన్ని ఊ హాగానాలకు తెరపడినట్లు అయింది.