కలెక్టరు సారు.. జిల్లాపై పట్టుసాధించేనా!
- నాడు డివిజన్ అధికారులు.. నేడు జిల్లా అధికారులు
కలెక్టర్లందరూ సిఎం నియోజక వర్గంపైనే దృష్టిపెట్టిన వైనం
జిల్లాలో గాడి తప్పిన పాలన
అవినీతి మత్తులో అధికారులు!
సంక్షేమ వసతి గృహాలపై కన్నెత్తి చూడని అధికారులు
జిల్లా కేంద్రంలో ఉండనీ అధికారులు
నారాయణపేట జిల్లా ఏర్పాటు అయి ఆరు సంవత్సరాలు అవుతున్న అభివృద్ధికి నోచుకోక ఆమడదూరంలో ఉంది.ఒకప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న నారాయణపేట ప్రాంతం మున్సిపాలిటీ ఉమ్మడి రాష్ట్రంలోనే రెండో మున్సిపాలిటీ గా ఏర్పాటు అయింది కానీ అది ఇంతవరకు కూడా అభివృద్ధికి నోచుకోక ఆమడదూరంలో ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా ఏర్పాటు అయిన తర్వాత నలుగురు కలెక్టర్లు వచ్చినా ఈ ప్రాంత అభివృద్ధిపై కృషిచేయకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గంపై దృష్టి సారించిన కలెక్టర్లు మిగతా జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించకుండా ఒక్కకోస్గి ప్రాంతానికి మాత్రమే కలెక్టర్లు అన్న చందంగా వ్యవహరించారని సర్వత్రా విమర్శలు సైతం ఉన్నాయి.
నారాయణపేట.మార్చి,15(విజయక్రాంతి) : నారాయణపేట జిల్లా ఏర్పాటు అయిన తర్వాత నలుగురు కలెక్టర్లు వచ్చినా కూడా అభివృద్ధి పై దృష్టి సారించకుండా ఒక్కకోస్గి ప్రాంతానికి మాత్రమే కలెక్టర్లుగా వ్యవహరించారని సర్వత్రా విమర్శలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఏర్పాటు అయినప్పటినుండి డివిజన్ అధికారులు ప్రస్తుతం వారే జిల్లా అధికారులుగా విధులు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమ శాఖకు న్యాయం చేయలేక అవగాహన లేక ఉన్న ఉద్యోగంలోనే జిల్లా అధికారులుగా వ్యవహరిస్తుండటం ఒక రకంగా చెప్పాలంటే జిల్లా అభివృద్ధికి ఆటంకం కలిగించినట్లేనని జిల్లా ప్రజలు వాపోతున్నారు.
పర్యవేక్షణ లేకపోవటం :
జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రతిరోజూ 12 గంటలకు పేటకు చేరుకొని సాయంత్రం 4 గంటలు అయిందంటే బస్సెక్కి తమ స్వంత గ్రామాలకు చేరుకోవటానికి గాను బస్ స్టేషన్ కు వెళుతున్న సందర్భం లేకపోలేదు. ఇక నుండైనా సంబంధిత అధికారులు జిల్లాలో ఉండేటట్లు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది
పెచ్చుమీరుతున్న అవినీతి:
జిల్లాలో కొన్ని ప్రజా సంబంధిత శాఖ అధికారులు ప్రజలకు ఏ వేణి పనులు కావాలంటే లంచం లేనిదే ముఖ్యమైన పనులు కావట్లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు
కొరవడిన పర్యవేక్షణ:
ఇంతవరకు పని చేసిన కలెక్టర్లు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కోస్గి మద్దూరు ప్రాంతాలపైనే పర్యవేక్షణ చేయటంతో జిల్లాలో సంబంధిత అధికారులు మాత్రం ఆడిందే ఆట పాడిందే పాట గా వ్యవహరిస్తున్నారని విమర్శలు సైతం ఉన్నాయి.
ఆన్లైన్ ఇసుకలో అక్రమలెన్నో:
జిల్లాలో ఆన్లైన్ ఇసుక పేరుకు మాత్రమే కమిటీ వ్యవహారాలు మాత్రం కొంతమంది జిల్లా కలెక్టర్ కార్యాలయఅధికారుల చేతుల్లో బందీ అయినట్లు దీంట్లో భాగంగానే చిట్యాల ఇసుక రీచ్ దగ్గర ఓ కంపెనీ ఆన్లైన్ ఇసుకను కొనుగోలు చేయుటకు గాను 26 కిలోమీటర్లు ఉండగా 15 కిలోమీటర్లకు గాను ఎమౌంట్ ఇస్తుండటంతో టిప్పర్ నిర్వాహకులు నష్టపోతున్నారు. దీంట్లో కంపెనీ అధికారులు సంబంధిత అధికారులు కుమ్మకైనట్లు ఆన్లైన్ లో ఇసుక సరఫరా చేస్తున్న టిప్పర్ నిర్వాహకులు వాపోతున్నారు ఈ నేపథ్యంలో కొన్ని సార్లు ఇసుకను ఆఫ్ లైన్ లో కూడా రవాణా జరుగుతున్న సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శలు సైతం ఉన్నాయి
మున్సిపాలిటీలో అక్రమలెన్నో : జిల్లాలో4మున్సిపాలిటీల్లో చేసిన పనులకు గాను బిల్లులు కావాలంటే సంబంధిత కాంట్రాక్టర్లు ఎంత కమీషన్ ఎక్కువ ఇస్తే ఆ కాంట్రాక్టర్లకు సంబంధిత అధికారులు బిల్లులు చేస్తున్నట్లు కాంట్రాక్టర్లు వాపోతున్నారు.
సంక్షేమ వసతి గృహాలవైపు కన్నెత్తి చూడని అధికారులు
సాంఘీక సంక్షేమ వసతి గృహాలలో ప్రభుత్వ అధికారుల అజమాయిషీ లేకపోవటంతో వసతి గృహం లో పనిచేస్తున్న వంట కార్మికులు సైతం అయిదంకెల్లో జీతాలు పొందుతూ దినసరి కూలీలను (నెల వారిగా 7000) కూలీలుగా నియమించి వంట కార్మికులు ఇంట్లో హాయిగా కాలం వెళ్లదీస్తున్నారు.
మాగనూర్, బాయ్స్ హాస్టల్, ఉట్కూరు,నారాయణపేట బాయ్స్ హాస్టల్లో నీ కార్మికులు దినసరి కూలీలను నియమించుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికైనా జిల్లాను అభివృద్ధి వైపు తీసుకెళ్లాలని పలువురు కోరుతున్నారు.




