26-11-2025 05:46:31 PM
వాముపక్ష ప్రజాసంఘాల నాయకుల డిమాండ్
భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): రైతాంగ కార్మిక వర్గాలపై నరేంద్ర మోడీ కక్షపూరిత వైఖరిన విడనాడాలని మోపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. పాల్వంచ పట్టణం అంబేద్కర్ సెంటర్లో వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించి రైతు, కార్మిక వ్యతిరేక నల్ల చట్టాల ను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ అనుబంధ రైతు సంఘం జాతీయ నాయకులు. కామ్రేడ్ ముత్యాల విశ్వనాథం సిపిఐ(ఎం) అనుబంధ సిఐటియు రాష్ట్ర నాయకులు కామ్రేడ్ దొడ్డా రవికుమార్ సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ అనుబంధ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కల్లూరు కిషోర్ సిపిఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ అనుబంధ ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు, కామ్రేడ్ గౌని నాగేశ్వరావులు మాట్లాడుతూ... బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం బడా పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేస్తూ రైతులను, కార్మికులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేసే దుర్మార్గమైన చట్టాలు చేస్తున్నాయని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలను మోసం చేస్తూ అంబానీ, ఆదాని, విజయ్ మాల్యా, లలిత్ మోడీ, టాటా, బిర్లా లాంటి బడా వ్యాపారవేత్తలకు అనుకూలమైన చట్టాలను తెచ్చి అమలు చేయడానికి ఎంతటి దుర్మార్గానికైనా ఒడిగడుతున్నాడని, అందులో భాగంగానే నాలుగు లేబర్ కోడ్ చట్టాలను, రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను తెచ్చి అమలు చేసేందుకు 2021 లోనే పూనుకోగా దేశవ్యాప్తంగా రైతాంగం లక్షల మంది ఢిల్లీ వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపటమే కాకుండా రెండున్నర సంవత్సరాల పాటు శాంతియుతంగా పోరాటం కొనసాగించారని ఆ పోరాటంలో 750 మందికి పైగా రైతులు చనిపోయారని అయినప్పటికీ నరేంద్ర మోడీకి, అమిత్ షాకు కొంచమైన ప్రజలపై, రైతులపై , కార్మికులపై జాలి దయ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
చతీస్ ఘడ్, ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను ఆనుకొని ఉన్న దట్టమైన అడవులలో యురేనియం తదితర ఖనిజ సంపదను దోపిడిదారులకు కట్టబెట్టేందుకు ఆదివాసులను నిర్దాక్షిణ్యంగా వారి నివాసాల నుండి వెళ్లగొట్టేందుకు కుట్రలు చేసి ఆదివాసీలకు అండగా నిలిచిన మావోయిస్టులను అంతం చేస్తామని ఆపరేషన్ కగార్ పేరుతో అడవుల్లోకి పోలీస్ మిలటరీ బలగాలను పంపించి. ఆదివాసి పల్లెల్లో నరమేధం సృష్టిస్తూ గ్రామాలపై దాడులు నిర్వహించి అమాయక ఆదివాసి పేదలను చిత్రహింసల పాలు చేసి చంపేస్తూ, మావోయిస్టులను ఇన్ఫార్మర్ల ద్వారా పట్టుకొని చట్ట విరుద్ధంగా చంపివేసి ఎన్కౌంటర్ పేరుతో కట్టుకథలు అల్లుతున్నారని ఈ దుర్మార్గాన్ని అరికట్టాలంటే, నల్ల చట్టాలను రద్దు చేయాలంటే ఈ దోపిడీ పాలక వర్గాలకు పోరాటం ద్వారా తగిన బుద్ధి చెప్పాలని, దోపిడీ పాలకులను గద్దె దించాలని అందుకు అన్ని వర్గాల రైతులు,కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించాలని అన్నారు.
ఈ ధర్నా కార్యక్రమంలో రైతు, కార్మిక, ప్రజాసంఘాల నాయకులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు, పి తులసీరామ్, అన్నారపు వెంకటేశ్వర్లు, ఇట్టి వెంకట్రావు, నిమ్మల రాంబాబు, కోరే కృష్ణ, వీసంశెట్టి పద్మజ, సత్య వేణి, బి మాధవి, ఎస్ కే నిరంజన్, కొంగర అప్పారావు, వైయస్ గిరి,విజయ్, రంజిత్, వీరన్న,పగిడిపల్లి సంజీవరావు, బిక్కులాల్, వెంకటేశ్వర్లు, రవి, సతీష్ ,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.