26-11-2025 05:42:20 PM
నిర్మల్ రూరల్: నేడు 76వ జాతీయ రాజ్యాంగ దినోత్సవంను రాజనీతి శాcస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిర్మల్ నందు ఘనంగా నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డా ఎం సుధాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మాట్లడుతూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 76 సంవత్సరాలు అవుతుందని అన్నారు. రాజనీతి శాస్త్ర విభాగం అధిపతి, అధ్యాపకుడు సింగరి రవీందర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలో అతి పెద్దదని, సుదీర్ఘమైనదని ఆయన తెలుపడం జరిగింది. తరువాత రాజ్యాంగ పీఠికను చదివి విద్యార్థుల ద్వారా పాటింప చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డా యు గంగాధర్, ఆఫ్రీన్, సుభాస్, హేమలత, అర్చన, ఏ వో నాగ శ్రీనివాస్, శ్రీనివాస్, పవన్, డా. రంజిత్ కుమార్, డా మురహరి, తిరుపతి రెడ్డి, నరేందర్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.