26-11-2025 05:43:31 PM
నిర్మల్ (విజయక్రాంతి): కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నివసిస్తూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఎన్టీఆర్ ట్యాంక్బండ్ వద్ద నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన కార్యకర్తలు రాస్తారోకో చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలను ప్రభుత్వం వెంటనే విడనాడి కార్మిక చట్టాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నందిరామయ్య రాజన్న సురేష్ గంగామణి సుజాత రామా ఇంద్రమాల రామ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.