24 March, 2026 | 8:37 PM

Breaking News

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన   •   జన గణనను పకడ్బందీగా పూర్తి చేయాలి   •   ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించేలా కృషి చేయాలి   •   ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •  

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ

28-07-2025 10:44 PM

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) ఆదేశాల మేరకు సోమవారం 60 వ డివిజన్ పరిధి వడ్డేపల్లిలో ఏ.ఈ నరేందర్ రాజు, మాజీ కార్పొరేటర్ ఎనుకొంటి నాగరాజు, డివిజన్ అధ్యక్షులు ఎనుకుంటి పున్నం చందర్ లు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులైన ఏదుల పురం నరసమ్మ, బుస్స సరోజల ఇంటి నిర్మాణ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇండ్ల లబ్ది చేకూర్చేందుకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే కృషి చేస్తున్నారు. ఇండ్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం విడతల వారీగా రూ.5 లక్షలు లబ్దిదారుల అకౌంట్లలో జమచేస్తుందని అన్నారు. ఇండ్లు మంజూరు అయిన లబ్దిదారులు ఇండ్ల నిర్మాణం పనులను ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది అజయ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు నవీన్ కుమార్, శేఖర్, కమల్ కుమార్, శేషు, సాజిత్, వంశీ తదితరులు పాల్గొన్నారు.