28-07-2025 10:41:51 PM
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి(Congress Party President Gummula Mohan Reddy), మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య అన్నారు. సోమవారం నల్లగొండ మండలం గుండ్లపల్లి గ్రామంలో ఎస్ఎల్ బిసి కాలువ నుంచి డి-37 కాల్వకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులు ఇప్పటికే నాట్లు వేశారని వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని డి-37 కాలువకు నీటిని విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో నల్గొండ నియోజకవర్గం అభివృద్ధిలో అన్ని రంగాలలో ముందుకుపోతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ జూలకంటి వెంక రెడ్డి, గుండ్లపల్లి మాజీ సర్పంచ్ పనస శంకర్, వజ్జ సత్యనారాయణ సత్యనారాయణ, వడ్డాల జానయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.