calender_icon.png 14 August, 2025 | 12:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండే వాతావరణం కల్పించడం మన అందరి బాధ్యత

13-08-2025 10:03:59 PM

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): విద్యార్థులు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండే వాతావరణం కల్పించడం మన అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్(District Collector Jitesh V. Patil) అన్నారు. బుధవారం బూర్గంపాడు మండలంలోని తెలంగాణ గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాల, వసతి గృహమును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వస్తే గృహంలో గదులు తనిఖీ చేసి, గదుల పరిశుభ్రత, గాలి ప్రసరణ, త్రాగునీటి సదుపాయాలు, విద్యుత్ సదుపాయాలు వంటి మౌలిక వసతులు పరిశీలించారు. అనంతరం వంటగది, భోజనశాల, మరుగుదొడ్లు పరిశీలించి వాటి పరిశుభ్రతను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థినిలతో మమేకమై మాట్లాడుతూ, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా? వంటి ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. 

భోజనశాలలో విద్యార్థులకు వడ్డించటానికి సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాలను తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేసి, భోజన సరఫరా విధానం, పరిశుభ్రత ప్రమాణాలను స్వయంగా పరిశీలించారు. భోజనం సరఫరాలో లోపాలు లేకుండా చూడాలని, పోషక విలువలతో కూడిన ఆహారమే అందించాలని వంట సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థినిలకు నాణ్యమైన విద్యతోపాటు సరైన సదుపాయాలు శుభ్రమైన వసతి, పోషకాహారంతో కూడిన భోజనం అందించడం ద్వారా మాత్రమే విద్యలో ఉత్తమ ఫలితాలు సాధించగల రన్నారు. పాఠశాల ప్రాంగణంలో మునగ, కరివేపాకు, నిమ్మ గడ్డి వంటి ఉపయోగకరమైన మొక్కలను నాటించి, వాటిని విద్యార్థినులు స్వయంగా సంరక్షించేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు  సిబ్బంది సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.