15 April, 2026 | 1:12 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

భూ భారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలి

21-10-2025 06:51 PM

జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్..

గద్వాల: భూ భారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం గట్టు మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, భూ భారతి రిజిస్ట్రేషన్ ప్రక్రియను సమగ్రంగా పరిశీలించి, సంబంధిత అంశాలపై వివరణలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భూ సమస్యల దరఖాస్తులను తక్షణమే పరిష్కరించడం అత్యంత ముఖ్యమని అన్నారు. భూ భారతి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో 22(A) సెక్షన్ కింద వచ్చే నిబంధనలను పూర్తిగా పాటించడం అత్యంత కీలకమని అన్నారు. రిజిస్ట్రేషన్‌కు నిషేధితంగా ఉన్న ప్రభుత్వ భూములు, వక్ఫ్ భూములు, దేవాదాయ భూములు, ఇతర ప్రత్యేక భూముల అక్రమ రిజిస్ట్రేషన్, విక్రయం లేదా ఏ విధమైన లావాదేవీలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ భారతి పోర్టల్‌లో డేటా ఎంట్రీలను ఖచ్చితంగా, వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. దరఖాస్తులకు సంబంధించిన నోటీసులు సమయానికి ఆన్‌లైన్‌లో జారీ చేయాలన్నారు.

సక్సేషన్, పెండింగ్ మ్యుటేషన్, మిస్సింగ్ సర్వే, పీవోపీ, డీ.ఎస్. పెండింగ్ దరఖాస్తులను నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలన్నారు. సాదా బైనమా అప్లికేషన్లను ముందుగానే సిద్ధం చేసి ఉంచి, ప్రభుత్వం ఆదేశాలు వచ్చే వెంటనే వాటిని తక్షణమే పూర్తి చేయగలరని కూడా తెలిపారు. అధికారులు ప్రతి దరఖాస్తును పరిశీలిస్తూ ఆధార్ కార్డులు, పట్టాదార్ పాస్‌బుక్, సాక్షుల ఆధార్ కార్డులను సక్రమంగా తనిఖీ చేయాలన్నారు. భూ రిజిస్ట్రేషన్ కోసం సమర్పించిన దరఖాస్తులు, బయోమెట్రిక్ ప్రాసెస్, నోటీసులు, సర్వే, మ్యుటేషన్ ప్రక్రియలను పూర్తిగా పరిశీలించి, నిబంధనలకు పూర్తి అనుగుణంగా ఉంటే మాత్రమే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. భూ భారతి రికార్డులు స్పష్టంగా, సరిగా ఉంచాలన్నారు. రెవెన్యూ కార్యాలయాల్లో రేషన్ కార్డుల వివరాలు, సర్టిఫికేట్లు, ఆఫీస్ రికార్డులు, ఇతర డాక్యుమెంట్లను అప్-టు-డేట్‌గా ఉంచి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, సేవలను సమయానికి, పారదర్శకంగా అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్ కుమార్,రెవెన్యూ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.