8 July, 2026 | 7:51 PM

Breaking News

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •   బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు   •   బిఆర్ఎస్ కు షాక్ .....   •   ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •  

అభివృద్ధి పనులకు భూమి పూజ

19-10-2024 05:24 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని వివిధ వార్డుల్లో నూతనంగా చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి శనివారం భూమి పూజ నిర్వహించారు. పట్టణంలోని 13 14 15 18,19,23,24 వార్డుల్లో 2.80 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సేఫ్టీక్ ట్యాంక్ పైప్ లైన్ తదితర అభివృద్ధి పనులకు శంఖు స్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నానని రానున్న రోజుల్లో పట్టణాన్ని చెన్నూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి పనులను అధికారులు పర్యవేక్షణ జరిపి నాణ్యతకు పెద్దపీట వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, కాంగ్రెస్ నాయకులు సొత్కు సుదర్శన్, దుర్గం నరేష్, గుడ్ల రమేష్, నోముల ఉపేందర్ గౌడ్, పైడిమల్ల నర్సింగ్, పాషా, ఇసాక్, జావిద్, వేముల శ్రీనివాస్, కూకట్ల తిరుపతిలు పాల్గొన్నారు.