12 August, 2026 | 2:56 AM

రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించిన భూస

12-08-2026 12:00 AM

చొప్పదండి 11 ఆగస్టు (విజయ క్రాంతి): రాష్ట్రస్థాయి తైక్వాండ్ పోటీల్లో సబ్ జూనియర్ అండర్ 18 కేజీలో అక్షయ హై స్కూల్ విద్యార్థి బూస ప్రహర్ష బంగారు పతకం సాధించి అక్టోబర్ 23వ తేదీలో మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో జరగబోతున్న టైక్వాండో జాతీయ స్థాయికి ఎంపికైన బూస ప్రహర్ష ను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అభినందించారు అలాగే జాతీయ స్థాయిలో కూడా పథకాన్ని సాధించి చొప్పదండి నియోజకవర్గంకు పేరు తీసుకురావాలని అన్నారు ఈ కార్యక్రమంలో అక్షయ పాఠశాల కరస్పాండెంట్ తమ్మడి కనకరాజు డిసిసి కరీంనగర్ సెక్రెటరీ తిరుపతి రెడ్డి ఆర్నకొండ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గంగారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మచ్చ రమేష్ తదితర పాల్గొన్నారు.