రెప్కోకు 114 కోట్ల లాభం
హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): రెప్కో హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ 2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.114 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.108 కోట్లతో పోలిస్తే లాభం పెరిగింది. జూన్ 30, 2026తో ముగిసిన త్రైమాసికానికి సంబం ధించిన ఆర్థిక ఫలితాలను కంపెనీ బోర్డు ఆ మోదించింది. జూన్ 30 నాటికి కంపెనీ మొత్తం లోన్ బుక్ రూ.15,990 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే సమయంలో ఉన్న రూ.14,690 కోట్లతో పోలిస్తే 8.9 శాతం వృద్ధి నమోదైంది.
మొదటి త్రైమాసికంలో రూ.938 కోట్ల రు ణాలను మంజూరు చేయగా, రూ.843 కోట్ల రుణాలను పంపిణీ చేసింది. కంపెనీ మొత్తం ఆదాయం రూ.468 కోట్లుగా నమోదైంది. గ తేడాది ఇదే కాలంలోని రూ.441 కోట్లతో పో లిస్తే 6.1 శాతం వృద్ధి సాధించింది. నికర వడ్డీ ఆదాయం రూ.216 కోట్లకు చేరగా, ఇది గత ఏడాది రూ.196 కోట్లుగా ఉంది.
ఆస్తుల నా ణ్యతలో భాగంగా జూన్ 30 నాటికి జీఎన్‌పీఏ రూ.427 కోట్లు, ఎన్‌ఎన్‌పీఏ రూ.194 కోట్లుగా నమోదయ్యా యి. కంపెనీ మూలధన సమృద్ధి నిష్పత్తి 36. 13 శాతంగా ఉండగా, నియంత్రణ సంస్థ నిర్దే శించిన కనీస నిష్పత్తి 15 శాతంగా ఉంది. జూ న్ 30 నాటికి దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, పు దుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో కలిపి 210 శాఖలు, 32 శాటిలైట్ కేంద్రాలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది.






