27-10-2025 12:31:27 AM
ఆర్మూర్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భముగా ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిదిలో ఆదివారం ఉదయం పెర్కిట్ బస్ స్టాండ్ దగ్గర నుండి ఆర్మూర్ లోని అంబేడ్కర్ చౌరస్తా వరకు సైకల్ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో వివిధ స్కూళ్ళ విద్యార్థులు, పోలీసు సిబ్బంది, ఇతరులు పాల్గొనినారు. తదానంతరం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ నందు సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించినారు.