27-10-2025 12:30:40 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, అక్టోబర్ 26 (విజయక్రాంతి):రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మకాలు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఆదివారం మెదక్ మండలం రాజుపల్లి గ్రామంలో విస్తృతంగా పర్యటించి ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రాన్ని, 33 /11 సబ్ స్టేషన్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 498 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, కేంద్రాల దగ్గర రైతులు ధాన్యాన్ని ఆరబెడుతున్నారని, అందులో మాయిశ్చరైన ధాన్యానికి టోకెన్ అందిస్తున్నామని తెలిపారు. టోకెన్ అందించడంతోపాటు మిల్లులకు కూడా ట్యాగింగ్ ఇచ్చేస్తున్నామన్నారు.
ధాన్యం సరఫరాకు వాహనాలన్నీ సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ధాన్యం కొనుగోలు బిల్లులు త్వరగా చెల్లించేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రైతులు దళారులను నమ్మి రైతులు మోస పోవద్దని,ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్ లోనే ధాన్యాన్ని విక్రయించాలని వెల్లడించారు. నిరంతర నాణ్యమైన ఉచిత విద్యుత్ రైతులకు అందాలని అధికారులకు సూచించారు.