27-10-2025 12:32:37 AM
కామారెడ్డి, అక్టోబర్ 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ గ్రామానికి చెందిన కమ్మరి లక్ష్మి , కమ్మరి రాజేశ్వరి వికలాంగురాలైన వారికి అండగా ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి తన సొంత డబ్బులతో గృహాన్ని నిర్మించి వారి చేతుల మీదుగా శనివారం రోజున ఓపెనింగ్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది.
వారికి ఆసరాగా నిలబడి పేదింటి ఇంటి నిర్మాణం చేపట్టి కట్టించి వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసినందుకు గ్రామస్తులు కుటుంబ సభ్యులు నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు.పి ఏ సి ఎస్ వ్యవసాయ కమిటీ చైర్మన్ పన్యాల నాగరాజు రెడ్డి ఇంటికి వెళ్లి తమ కుమారుడు వివాహానికి అందరూ హాజరుకావాలని ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు అనంతరెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ పన్యల నాగరాజు రెడ్డి, తాటిపల్లి శ్రీకాంత్, అబ్రబోయిన స్వామి, సీతారాం మధు, ఇంద్రసేనారెడ్డి రవీందర్ రెడ్డి, గాజులపల్లి శేఖర్ బాపురెడ్డి రాజు సంజీవరెడ్డి పిన్నం నాగేంద్ర వర్మ, పున్న లక్ష్మణ్, సిద్ధారెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు.