కుమారుడికి బైడెన్ క్షమాభిక్ష
03-12-2024 04:20 AM
వాషింగ్టన్, డిసెంబర్ 2: అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగుపోనున్న జో బైడెన్ తన కుమారుడికి భారీ ఊరట కల్పించారు. హంటర్ బైడెన్‌పై నమోదైన కేసుల్లో క్షమాభిక్ష ప్రసాదించారు. రాజకీయ కక్షలో భాగంగానే హంటర్‌పై తప్ప డు కేసులు పెట్టారని బైడెన్ ఆరోపించారు. 2018లో తుపాకీ కొనుగోలు, పన్ను ఎగవేత వంటి కేసుల్లో ఈ ఏడాది జూన్‌లో న్యాయస్థానం హంటర్‌ను దోషి గా తేల్చింది. ఈ కేసుల్లో బైడెన్ తన కొడుకుకు ఊరట కల్పించారు.
జో బైడెన్ తన కుమారుడికి క్షమాభిక్ష పెట్టడాన్ని అమెరికా ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తప్పు పట్టారు. బైడెన్ నిర్ణయాన్ని న్యాయ విఘాతంగా పేర్కొనడంతోపాటు ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.






