ఏటా 1.3 లక్షల కోట్ల హవాలా
హసీనా పాలనపై యూనస్ సర్కార్ ఆరోపణలు
ఢాకా, డిసెంబర్ 2: షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పాలనలో ప్రతీ సంవత్సరం 16 బిలియ న్ డాలర్లు (రూ.1.3 లక్షల కోట్లు) బంగ్లాదేశ్‌ను దాటయని మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేర కు 2009 నుంచి 2023 వరకు జరిగిన అవినీతిపై డాక్టర్ దేబప్రియా భట్టాచార్య నేతృత్వంలోని కమిటీ శ్వేతపత్రాన్ని సోమవారం విడుదల చేసింది.
హసీనా పాలనలో మొత్తం 234 బిలియన్ డాలర్లు (19 లక్షల కోట్లకు పైగా) సొమ్ము దేశాన్ని దా టిందని డెయిలీ స్టార్ కథనంలో పేర్కొంది. ఈ సొమ్మును భారత్ స హా పన్ను రహిత దేశాలకు తరలినట్లు శ్వేతపత్రంలో పేర్కొన్నారు. ఈ పత్రాన్ని మహ్మద్ యూనస్ చారిత్రక పత్రమని అభివర్ణించారు. ‘హ సీనా ప్రభుత్వ హయాంలో ఏటా 24 బిలియన్ డాలర్ల (రూ.2 లక్షల కోట్లకు పైగా) నుంచి 60 బిలియన్ డాలర్ల (రూ.5 లక్షల కోట్లకు పైగా) ను ఆయా అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించేవారు. ఇందులో అత్యధిక సొమ్ము రాజకీయ నాయకుల జేబుల్లోకి, లంచాల రూపంలో పో యింది’ అని పేర్కొన్నారు.






