12-12-2025 04:53:57 PM
బిఆర్ఎస్ పార్టీతో కలిసి బైక్ ర్యాలీ
కోదాడ: మండల పరిధిలోని గణపవరం గ్రామ ఓటర్ల చూపు ఇప్పుడంతా స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి బల్గూరి స్నేహ దుర్గయ్య వైపే మళ్లినట్టుగా కనిపిస్తోంది. శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ స్వతంత్ర సర్పంచి అభ్యర్థి బల్గూరి స్నేహ దుర్గయ్యకు సపోర్ట్ చేయడంతో గణపవరం గ్రామంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. చివరి రోజు ప్రచారం కావడంతో టిఆర్ఎస్ పార్టీతో కలిసి బైక్ ర్యాలీ గ్రామంలో నిర్వహించారు.
గ్రామంలో జరుగుతున్న ప్రచార కార్యక్రమాలు, ప్రజల స్పందన చూస్తే స్నేహ దుర్గయ్యకు ఎన్నికల్లో మంచి గాలి వీచుతున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.స్వతంత్ర అభ్యర్థి అయినప్పటికీ గ్రామంలోని పలువురు కీలక నాయకుల మద్దతు లభించడం, ఇటీవల నిర్వహించిన ప్రచార ర్యాలీల్లో ప్రజల విస్తృతంగా పాల్గొనడం స్నేహ దుర్గయ్య విజయ అవకాశాలను మరింత బలపరిచాయి. మహిళలు, యువత భారీగా మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో గణపవరం గ్రామ ఎన్నికలు కొత్త మలుపు తీసుకున్నాయి.
గ్రామాభివృద్ధికి కట్టుబడి పనిచేసే నాయకత్వం స్నేహ దుర్గయ్యదేనని గ్రామ ప్రజలు విశ్వసిస్తున్నట్టు ప్రచారంలో స్పష్టంగా తెలుస్తోంది. ఏది ఏమైనా గాని గ్రామ ఓటర్లు వాలీబాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నాయకులు, గ్రామ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.