calender_icon.png 12 December, 2025 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులకు ఆటంకంగా కాంపౌండ్ వాల్స్

12-12-2025 04:57:17 PM

పెద్దపల్లి జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష

సుల్తానాబాద్,(విజయక్రాంతి): అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉన్నటువంటి కాంపౌండ్ వాల్స్ కూల్చివేత పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష అన్నారు, శుక్రవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సుల్తానాబాద్ లో విస్తృతంగా పర్యటించారు, పట్టణంలోని పురపాలక కార్యాలయం, బాలికల ఎస్సీ హాస్టల్, ప్రభుత్వ వైద్యశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరిశీలించిన కలెక్టర్ పలు సూచనలు చేశారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ సుల్తానాబాద్ పట్టణంలో ఆర్ అండ్ బీ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి కాంపౌండ్ వాల్, ఎంపిడిఓ కార్యాలయ కాంపౌండ్ వాల్ కూల్చివేత పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. ఎస్సీ బాలికల హాస్టల్ వద్ద కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.అంబేద్కర్ విగ్రహం నుంచి గట్టపల్లి వరకు విద్యుత్ పోల్స్, ట్రాన్స్ ఫార్మర్ షిఫ్టింగ్ పనులు డిసెంబర్ 16 లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఆసుపత్రి వద్ద అవసరమైన డ్రైనేజీ నిర్మాణ పనుల ప్రతిపాదనలు అందించాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్మాణం అవుతున్న పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ పాత భవనాలను వెంటనే తొలగించాలని అన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ రమెష్, ఆర్ అండ్ బీ డి.ఈ. రవికిరణ్ ,ఏఈ గుణశేఖర్ రెడ్డి, ఎలక్ట్రికల్ ఏ ఈ కిషోర్, మున్సిపల్ ఏఈ రాజ్ కుమార్, మున్సిపల్ మేనేజర్ ఆలీమొద్దీన్, సంబంధిత అధికారులు,  తదితరులు పాల్గొన్నారు.