12-12-2025 05:42:11 PM
ఉప్పల్,(విజయక్రాంతి): దేవుని దీక్షలు ఆరోగ్యానికి రక్షాన్ని ఉప్పల్ నియోజకవర్గ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం రోజున నాచారం సావర్కర్ లోని అయ్యప్ప దేవాలయం 18వ వార్షికోత్సవ సందర్భంగా బండ శేఖర్ రెడ్డి ఏర్పాటుచేసిన అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమానిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... భవాని అయ్యప్ప స్వామి దీక్షలు భక్తి ముక్తిదాయక అనుసరించే నియమాలన్నారు.
నిత్యం పోషకారక పూజా విధానంలో ఉండే దీపాలు ధూపాలు హారతులు ఆరోగ్యాన్ని ఇవ్వడంతోపాటు నేత్ర నాసిక వ్యాధులనుకూడా దూరం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం స్వామి వారి ప్రసారం భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు సాయి జన్ శేఖర్ నాయకులు కట్ట బుచ్చన్న గౌడ్ విట్టల్ యాదవ్ చంద్రశేఖర్ సుగుణాకర్ రావు పాల్గొన్నారు