12-12-2025 04:51:35 PM
తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని యావాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఎంజాల స్వామి విజయపతంలో ముందుకు దూసుకు పోతున్నారు. ఎంజాలస్వామి తనదైన శైలిలో గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. గతంలో వీరి తండ్రి యావపూర్ గ్రామ సర్పంచిగా సేవలు అందించారు. గ్రామ ప్రజలు వీరికి మరోసారి అవకాశం ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం గ్రామంలో కళాకారుల బృందాల చేత ఆటపాటలతో ఎంజాల స్వామి పార్టీ ముందుకు తీసుకుపోవడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.