calender_icon.png 12 December, 2025 | 6:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్‌లో నవోదయ పరీక్షకు ఏర్పాటు పూర్తి

12-12-2025 04:49:17 PM

నిర్మల్,(విజయక్రాంతి):  నిర్మల్ లో శనివారం జరగనున్న నవోదయ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న తెలిపారు. ఈ పరీక్ష ఉదయం ఉదయం 11:30 నుండి పగలు 1.30 వరకు జరుగుతున్నదని పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఒక గంట ముందుగానే చేరుకోవాలని ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి హాల్ టికెట్ తో పాటు ఆధార్ కార్డును వెంట ఉంచుకోవాలని సూచించారు. ఈ పరీక్షకు నిర్మల్ జిల్లాలో 1552 మంది విద్యార్థులు హాజరగుతున్నట్లు వెల్లడించారు.

బైంసా ప్రాంత విద్యార్థులకు బైంసాలోని ఆల్ ఫోర్స్ ,వేదం, వాసవి పాఠశాలలు పరీక్ష కేంద్రాలుగా కలవని ,నిర్మల్ ప్రాంత విద్యార్థులకు నిర్మల్ లోని సెయింట్ థామస్ హై స్కూల్, విజయ హై స్కూల్లో పరీక్ష కేంద్రాలుగా కలవని ,ఖానాపూర్ ప్రాంత విద్యార్థులకు నిర్మల్ దివ్య నగర్ లోని వాసవి హై స్కూల్ పరీక్ష కేంద్రంగా కలదని తెలియజేశారు .24 మంది విద్యార్థులకు చొప్పున కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రతి పరీక్ష కేంద్రానికి చీఫ్ సూపరిండెంట్ తో పాటు కాగజ్  నగర్ లోని నవోదయ విద్యాలయానికి చెందిన లెక్చరర్లు సెంటర్ లేబర్ అబ్జర్వర్లుగా నియమించబడ్డారని చెప్పారు.

ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, జిరాక్స్ సెంటర్లు మూసివేయబడి ఉంటాయని వెల్లడించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద మెడికల్ సిబ్బందితోపాటు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. శుక్రవారం పరీక్ష కేంద్రాలను నిర్మల్ జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ మూడారపు పరమేశ్వర్ సందర్శించి, ఏర్పాట్లను పర్యవేక్షించారు .ఇన్విజిలేటర్లకు సూచనలు అందజేశారు.