calender_icon.png 23 July, 2025 | 11:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవో నిలుపుదల కంటి తుడుపు చర్యే

23-07-2025 01:02:18 AM

ఎమ్మెల్యే హరీష్ బాబు

కాగజ్‌నగర్, జూలై22 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.49 తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, రద్దు చేసేంతవరకు ఆందోళన చేస్తామని  ఎమ్మె ల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు.  మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసి సంఘాలు, భారతీయ జనతా పార్టీ  , వివిధ ప్రజా సంఘాలు  నిర్వహించిన ఏజె న్సీ ప్రాంతాల  బంద్ సంపూర్ణం కావడం తో ప్రభుత్వం దిగివచ్చి మెమో ఇచ్చిందని తెలిపారు.

ఈ జీవోను తాత్కాలికంగా నిలుపు దల చేయడం కేవలం కంటి తుడుపు చర్య అని, జీవో రద్దు చేసే వరకు పోరాటాలు విరమించేది లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తేనే జీవో తెచ్చామని కాంగ్రెస్ నాయకులు బీరాలు పలికారని, ఇప్పుడు తాత్కాలిక నిలుపుదల ఆర్డర్స్ ఇవ్వడానికి కేంద్రాన్ని సంప్రదించారా ? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రమేయం లేని అంశంలో భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఇచ్చిన ఉత్తర్వుల వలన వారి నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నారని ఆరోపించారు.

ఈ సమావేశంలో భాజపా జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం, జిల్లా కోశాధికారి అరుణ్ లోయ, మాజీ కౌన్సిలర్లు ఈర్ల విశ్వేశ్వర్ రావు, సింధం శ్రీనివాస్, బాల్క శ్యామ్, మాజీ ఎంపిపి మనోహర్ గౌడ్, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు చిప్పకుర్తి శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ తిరుపతి, సాంబయ్య, గణపతి లింగమూర్తి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.