23-07-2025 01:00:29 AM
- వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్
- విధుల్లో క్రమశిక్షణ, సమయపాలన పాటించాలి
ఆదిలాబాద్, జూలై ౨2 (విజయక్రాంతి): ప్రతి ఒక్క వార్డుకు పోలీసు అధికారులకు కేటాయించి అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. రానున్న పంచాయితీ, మున్సిపాలిటీ ఎన్నికలకు సంసిద్ధమై ఉండాలన్నారు. మంగళవారం స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నమో దైన కేసులు, కేసుల దర్యాప్తుపై, రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లు, పట్టణంలో జరుగుతున్న నేరా లు తదితర వాటిపై ఆరా తీశారు.
సిబ్బందితో మాట్లాడుతూ ప్రతి ఒక్క వార్డుకు విలేజ్ పోలీస్ ఆఫీసర్ (వీపిఓ) ను కేటాయించి సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకుని అసాంఘిక కార్యకలాపాలపై పూర్తి సమాచారాన్ని రాబట్టాలన్నారు. పట్టణంలో ఎలాంటి గంజాయి, డ్రక్స్, గేమింగ్, బెట్టింగ్, నిర్వహించకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసులు విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా, క్రమశిక్ష ణ సమయపాలన పాటించాలని ఆదేశించా రు.
ప్రజలను పోలీసులు నిరంతరం కనిపెడుతూ ఎలాంటి సమస్యలకైనా నిమిషాల వ్యవధిలో సంఘటనా స్థలాలకు చేరుకొని, సాధ్యమైనంత వాటిని పరిష్కరిస్తూ ప్రజలను పోలీసుల నమ్మకాన్ని మరింత పెంపొందించాలని సూచించారు. ప్రజలకు న్యాయం జరిగినప్పుడు సరైన సమయంలో స్పందించినప్పుడు పోలీసుల కీర్తి ప్రతిష్టలు ఉన్నత శిఖరాలకు చేరుతాయని సూచించా రు.
సిబ్బంది నిజాయితీతో విధుల నిర్వర్తించాలని సూచించారు. కేసుల నమోదు దర్యాప్తులో ఎలాంటి జాప్యం వహించకుండా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు. కేసుల దర్యాప్తును కేటాయించి ప్రతి ఒక్కరికి సమానమైన విధులు వచ్చే విధంగా పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ సునీల్ కుమార్, ఎస్‌ఐ నాగనాథ్, రమ్య, పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.