24 July, 2026 | 3:25 AM

ఘనంగా మంత్రి శ్రీధర్‌బాబు జన్మదినోత్సవం

31-05-2024 02:50 AM

హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): ఐటి, పరిశ్రమలు, శాసనసభా వ్యవహరాల శాఖా మంత్రి దిద్దుళ్ళ శ్రీధర్‌బాబు జన్మదినోత్సవ వేడుకలు గురువారం గాంధీ భవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నాయకుడు, తెలంగాణ  ప్రజా  సంఘాల జేఏసీ ఛైర్మన్ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి శ్రీధర్‌బాబు నూరేళ్ళు ఆయురారోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో  కోదండరెడ్డి, దేవని సతీష్ మాదిగ, ఉట్ల వరప్రసాద్, బిక్షపతి, కుచన రవళి, ఆనంద్, ప్రశాంత్ రెడ్డి తదితరులు  పాల్గొన్నారు.