బట్టీలలో బాల్యం బందీ
సూర్యాపేట, మే30 (విజయక్రాంతి): చట్టాలున్నా చూడటానికి కళ్లు లేవు. హక్కులున్నా వారిని అక్కున చేర్చుకోవు. ఫలితం గా బడిబాట పట్టాల్సిన బాల్యం పనిబాట పడుతోంది. చదువులమ్మ ఒడిలో అక్షరజ్ఞానం నేర్చుకోవాల్సిన జీవితాలు ఎండవానల్లో ఎండమావులుగా మారుతున్నాయి. పలకాబలపం పట్టాల్సిన చేతులు ఇటుక బట్టీలలో పలుగుపార సంకెళ్లలో నలుగుతున్నా యి. సూర్యా పేట జిల్లాలో బాల కార్మికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా వలస కార్మిక కుటుంబాల పిల్లలే ఇటుక బట్టీల మట్టిలో మగ్గుతున్నట్లు తెలుస్తోంది.
ఊరికి దూరంగా..
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా నాలుగు నియోజకవర్గాలలో ఇటుక బటీలు వందల సంఖ్య ల్లో ఉన్నాయి. గ్రామ పంచాయతీల పరిధిలో ఊళ్లకు దూరంగా వెలసిన బట్టీలలో 90 శాతం వాటికి అనుమతులు లేవని పంచాయతీ అధికారులే చెబుతున్నారు. బట్టీలలో పనిచేసేందుకు స్థానికు లు కూలీలుగా వచ్చే అవకాశం లేకపోవడం తో నిర్వాహకులు పక్క రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొస్తున్నారు. ఇక్కడే తాత్కాలిక వస తులు కల్పించడంతో కుటుంబాలు సహా ఒరిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రా ల నుంచి కూలీలు సొంతూళ్లు వదిలి ఇక్కడకు వస్తున్నారు. బట్టీలు ఊళ్లకు దూరంగా ఉం డడం, వసతులు అక్కడే ఏర్పాటు చేయ డం, పాఠశాలలు అందుబాటులో లేకపోవడం.. కూలీల పిల్లలకు విద్యకు దూరం కావాల్సి వస్తోంది. ఇదే క్రమంలో ఆర్థిక అవసరాలు కూలీలు తమ పిల్లలను కూడా వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితులు ఎదురువుతున్నా యి. దీంతో ఆటపాటలతో అలరారాల్సిన బాల్యం బట్టీల నడుమ మట్టి పనుల్లో మగ్గిపోతోంది.






