16 April, 2026 | 10:50 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ చార్జిషీట్

02-02-2026 01:25 PM
  1. కేంద్రం నిధుల కోసమే స్థానిక ఎన్నికలు
  2. గ్యారంటీలు అంటూ ఓట్లు.. అవి నెరవేర్చలే
  3. మోసపూరిత హామీటు ఇచ్చి అధికారంలోకి కాంగ్రెస్
  4. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది చెప్పాలి
  5. సర్కార్ ఉద్యోగులకు సమయానికి జీతాల్లేవ్ 

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అపారంగా నిధులిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు(BJP President Ramachander Rao) అన్నారు. రెండేళ్ల కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలోని వైఫల్యాలపై బీజేపీ చార్జిషీట్‌ విడుదల చేసింది. నాంపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో రామచందర్ రావు(Ramachander Rao) మాట్లాడుతూ... ఆరు గ్యారంటీలు అంటూ ఓట్లు వేయించుకున్నారు.. అవి నెరవేర్చలేదని ఆరోపించారు. ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బూటకపు హామీలు, మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కోసమే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా ఇవ్వట్లేదని రామచందర్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్న పరిస్థితులే కాంగ్రెస్ పాలనలో ఉన్నాయని చెప్పారు. గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు లేవు, ఇందిరమ్మ ఇళ్లు లేవన్నారు. మున్నిపల్ ఎన్నికల్లో కమలం పార్టీకి పట్టం కట్టాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.