calender_icon.png 31 January, 2026 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాత్మా గాంధీ పోరాటాలను చెరిపివేయాలని కుట్ర చేస్తున్న బిజెపి

30-01-2026 08:09:36 PM

- సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్,(విజయక్రాంతి): జాతిపిత మహాత్మా గాంధీ పోరాటాలను చెరిపివేయాలని బిజెపి కుట్ర చేస్తుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం గాంధీ వర్ధంతిని డిసిసి కార్యాలయంలో నిర్వహించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, పలువురు నాయకులతో కలిసి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినారు. ఈ సందర్భంగా ఆయన మోహన్ దాస్ కరం చంద్ గాంధీ ఈ దేశ స్వాతంత్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టి, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టడంలో కీలకపాత్ర వహించిన గొప్ప నాయకులన్నారు.

దేశంలోని ప్రజలందరినీ సంఘటితం చేసి అహింస మార్గంలో స్వాతంత్రాన్ని సాధించిన మహనీయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బానోతు శ్రవణ్ నాయక్, కొర్వి అరుణ్ కుమార్, అబ్దుల్ రహమాన్, కంకణాల అనిల్ కుమార్ గుప్తా, కుర్ర పోచయ్య, గాలి అనిల్ కుమార్, మాదాసు శ్రీనివాస్, ఇన్నా రెడ్డి,  పోతారపు సురేందర్, సిరికొండ శివప్రసాద్, జూపాక సుదర్శన్, సుధాకర్ నాయక్, శిల్ప, జొన్నల రమేష్, సత్తినేని శ్రీకాంత్,కుంట రాజేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.