calender_icon.png 30 January, 2026 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావాలి

30-01-2026 08:11:41 PM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల, జనవరి 30(విజయ క్రాంతి): ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావాలి అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శుక్రవారం పేర్కొన్నారు. నకిరేకల్ పట్టణంలోని ఎవీఎం స్కూల్ నందు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ వారి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావాలి అని, ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.

ముఖ్యంగా పేదలు, నిరుపేదలు ఆరోగ్య సమస్యలను గుర్తించి తగిన చికిత్స పొందేందుకు ఈ శిబిరాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని, లయన్స్ క్లబ్ మరియు యశోద హాస్పిటల్ సేవలు సమాజానికి ఆదర్శమని ఎమ్మెల్యే ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, వైద్యులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల యాజమాన్యం, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు పాల్గొన్నారు.