calender_icon.png 30 January, 2026 | 9:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంగాపూర్ జాతరకు ట్రాఫిక్ మళ్లింపు: జిల్లా ఎస్పీ నితికా పంత్

30-01-2026 08:06:42 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): గంగాపూర్ జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం జరగకుండా రహదారులను మళ్లించినట్లు  ఎస్పీ నితికా పంత్ తెలిపారు. జాతరకు వచ్చే భక్తులు ఈ మార్గాలను గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తాండూర్, బెల్లంపల్లి, మంచిర్యాల వైపు నుంచి వచ్చే ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు రెబ్బెన ఫ్లైఓవర్ మీదుగా వెళ్లి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలోని సింగిల్ గూడ రైల్వే అండర్‌పాస్ బ్రిడ్జ్ ద్వారా సింగిల్ గూడ–గంగాపూర్ గ్రామం మీదుగా జాతరకు చేరుకోవాలని తెలిపారు.

అదేవిధంగా కార్లు, బస్సులు రెబ్బెన బస్ స్టేషన్ వద్ద యూ-టర్న్ తీసుకుని రైల్వే గేట్ ద్వారా జాతరకు వెళ్లాలని సూచించారు. ఆసిఫాబాద్ వైపు నుంచి వచ్చే ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు సింగిల్ గూడ రైల్వే అండర్‌పాస్ బ్రిడ్జ్ ద్వారా గంగాపూర్ గ్రామం మీదుగా వెళ్లాలని, కార్లు, బస్సులు రెబ్బెనలోని గంగాపూర్ రైల్వే గేట్ ద్వారానే జాతరకు వెళ్లాలని పేర్కొన్నారు.

జాతర నుంచి బయటకు వెళ్లే వాహనాలు గంగాపూర్ న్యూ ఆర్చ్ నుంచి వెంచర్ మార్గం (న్యూ రోడ్) ద్వారా పల్లవి బ్రిడ్జి మీదుగా వెళ్లాలని తెలిపారు. గంగాపూర్ కమాన్ నుంచి ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు అనుమతి లేదని, ఆసిఫాబాద్ వైపు వెళ్లే అన్ని వాహనాలకు గోలేటి క్రాస్ రోడ్ వద్ద యూ-టర్న్ సౌకర్యం కల్పించినట్లు పోలీసులు తెలిపారు. భక్తులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.