calender_icon.png 15 September, 2025 | 11:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతాంగ పోరాటాన్ని వక్రీకరిస్తున్న బీజేపీ

15-09-2025 12:00:00 AM

డీవైఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి  గడ్డం వెంకటేష్

ఆదిలాబాద్, సెప్టెంబర్ 14 (విజయక్రాం తి):  వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరా ట చరిత్రను బీజేపీ వక్రీకరించి నిజమైన పోరా ట చరిత్రను తప్పుదోవ పట్టిస్తోందని డివైఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి గడ్డం వెంకటేష్ ఆరోపించారు.

ఆదివారం స్థానిక మాలీ సం ఘం భవనంలో జిల్లా అధ్యక్షుడు ఆనంద్ అధ్యక్షతన జరిగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం-వాస్తవాలు వక్రీకరణలు అనే అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్ లో ఆయన ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ... తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కనీసం పాత్ర లేని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విలీనం అని, విమోచనం అని చరిత్రను వక్రీకరించి చెబుతున్నారు అని అన్నారు. ఇదే కాకుండా రజాకార్, కేరళ స్టోరీ కశ్మీర్ ఫైల్ పేరుతో తప్పుడు చరిత్రను ఆధారంగా చేసుకొ ని చిత్రాలు నిర్మించి యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రైతాంగ పోరా ట చరిత్రను హిందూ, ముస్లిం పోరాటంగా చూపిస్తున్నారు అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐబీజిల్లా కార్యదర్శి గొడి సెల కార్తీక్, జిల్లా ఉపాధ్యక్షులు పురుషోత్తం, దుర్గం నిఖిల్, సహాయ కార్యదర్శిలు  శ్రీకాంత్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.