15-09-2025 12:00:00 AM
ఏరియా సింగరేణి జీఎం
మందమర్రి, సెప్టెంబర్ 14: సింగరేణి కార్మిక క్రీడాకారులు ఏరియా స్థాయి పోటీ ల్లో ప్రతిభ కనబరిచి కోలిండియా స్థాయి పోటీలకు ఎంపికై పతకాలు సాధించాలని ఏరియా సింగరేణి జీఎం ఎన్ రాధాకృష్ణ కోరారు. ఏరియాలోని ఎల్లందు క్లబ్‌లో ఆదివారం వర్క్ పీపుల్ స్పోరట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 61వ వార్షిక క్రీడోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ఉద్యోగి ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంస్థ అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు.
సింగరేణి యాజమాన్యం కార్మిక క్రీడాకారులను అన్ని విధాలు గా ప్రోత్సహిస్తుందని క్రీడాకారులు క్రీడల్లో నైపుణ్యం పెంపొందించు కోవాలన్నారు. ఏరియా క్రీడాకారులు కోల్ ఇండియా పోటీలకు ఎంపికై పతకాలు సాధించి సింగరేణికి , ఏరియాకు పేరు ప్రఖ్యాతలు తీసుకు రావాలని అయన కోరారు. అనంతరం టేబుల్ టెన్నిస్, షటిల్ బాడ్మింటన్, బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, పోటీలను ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి బ్రాం చ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, సీఎంఓఏఐ ఏరియా ప్రెసిడెంట్ రమేష్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, సీనియర్ పిఓ, క్రీడల గౌరవ కార్యదర్శి ఎం కార్తీక్, అసిస్టెంట్ స్పోరట్స్ సూపర్వైజర్ అశోక్ పాల్గొన్నారు.