07-05-2025 06:41:51 PM
నిర్మల్ (విజయక్రాంతి): పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారత సైన్యం ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) పేరుతో దాడులు నిర్వహించి ఉగ్రవాద సంస్థలను ధ్వంసం చేయడంతో బుధవారం నిర్మల్ లో బీజేపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట 'భారత్ జై హింద్' అంటూ నినాదాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఉగ్రవాదుల ఊచకోతను నిరసిస్తూ భారత సైన్యం ఉగ్రవాదులపై దాడి చేయడం పట్ల భారతదేశం మొత్తం హర్షిస్తుందన్నారు.
దాడిలో భారత్ సైన్యం ప్రతీకారం తీసుకోవడం హర్షనీయం అని భారత సైన్యానికి, నరేంద్ర మోడీకి అందరం అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి, మాజీ జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య, రాష్ట్ర నాయకులు రావుల రామనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసిన్ రాజు, జిల్లా ఉపాధ్యక్షులు అలివేలుమంగ, కమల్ నయన్,దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఒడిశాల అర్జున్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రజనీ వైద్య,పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, మాజీ పట్టణ అధ్యక్షులు సాధం అరవింద్, స్టేట్ కౌన్సిల్ సభ్యులు దశరథ్ పోశెట్టి, అదేపు సుధాకర్, నాయకులు శ్రీరామోజు నరేష్, రాజు, భరత్, భూపతి రెడ్డి, అయన గారి రాజేందర్ తదితరులు ఉన్నారు.