సొంతగూటికి బీఆర్‌ఎస్ నాయకులు

29-04-2024 01:24:27 AM

జహీరాబాద్, ఏప్రిల్ 28 : ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన రిజర్వేషన్లను తీసివేస్తామని అమిత్‌షా చేసిన వ్యాఖ్యాలకు నిరసనగా జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడంపల్లి మండలంలోని గౌస బాద్‌కు చెందిన మాజీ సర్పంచ్, మాజీ ఉప సర్పంచ్ తన అనచరులతో బీజేపీ పార్టీకి రాజీనామ చేసి ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆదివారం జహీరాబాద్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో గౌసబాద్ గ్రామ మాజీ సర్పంచ్ సంజీవ్‌రాథోడ్, జానురాథోడ్, తన అనచరులతో కలిసి బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రారు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సలహదారుడు దేవిప్రసాద్, నాయకులు సంజీవ్‌రెడ్డి, గోపాల్, తిమోటీ, హీరురాథోడ్, ఓంకర్‌రాథోడ్, కిషన్, సంజు చౌహన్, కాలూపవర్ తది తరులు పాల్గొన్నారు.

శాస్త్రవేత్తగా మంచి పేరు తెచ్చుకోవాలి

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కంబాలపల్లికి చెందిన డా. శ్రీశైలంను వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎంపికైనందుకు ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అభినందించారు. ఆదివారం ఝరాసంగంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఆయన హాజరై శ్రీశైలంను శాలువతో సత్కారించి ప్రొత్సాహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ తన సొంత మండలానికి చెందిన డాక్టర్ శ్రీశైలం ఎఎస్‌ఆర్‌బీ పరీక్షలో పాసై అరుణాచల్‌ప్రదేశ్‌కు వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎంపిక కావడం అనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు వెంకటేశం, నాయకులు నర్సింహాగౌడ్, జగదీశ్, కిషన్, విజయ్, మాణిక్ పాల్గొన్నారు.