calender_icon.png 15 December, 2025 | 3:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటాలి

15-12-2025 01:40:04 PM

ఎంపీ రఘునందన్ రావును కలిసిన మండల బీజేపీ నాయకులు

విజయక్రాంతి,పాపన్నపేట: రానున్న ఎంపీటీసీ, జెడ్పిటీసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు( MP Raghunandan Rao) సూచించారు. సోమవారం పాపన్నపేట మండల బీజేపీ నాయకులు ఆయన స్వగృహం హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు సత్తా కనబరచలేకపోయారని, రానున్న ఎంపీటీసీ, జెడ్పిటీసీ ఎన్నికల్లో బీజేపీ గుర్తుతో పోటీ ఉన్నందున సత్తా చాటాలని, 15 ఎంపీటీసీ స్థానాలు, జడ్పీ స్థానం కైవసం చేసుకునే దిశగా మండల నాయకులు అహర్నిశలు కృషి చేయాలని సూచించారు.

త్వరలో బిజెపిలోకి భారీ చేరికలు ఉంటాయని, మండలంలో బిజెపి పార్టీ బలోపేతమై తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గాజులగూడం కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పుట్టల మల్లేశం ఎంపీ ఆధ్వర్యంలో బిజెపి కండువా కప్పుకున్నారు. మండల అధ్యక్షులు వడ్ల సంతోష్ చారి, ఉపాధ్యక్షులు బాగేష్, మల్లేశం, నాగభూషణం, గౌస్, సాయిలు, మురళి, బాబు, శంకరయ్య తదితరులు ఉన్నారు.