calender_icon.png 15 December, 2025 | 4:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రజాస్వామ్య సంస్థ కాదు.. ఒక కుటుంబ ఆస్తి

15-12-2025 03:00:54 PM

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కొరవడిందని, అది ఒక కుటుంబ సంస్థలా పనిచేస్తోందని ఆరోపిస్తూ బీజేపీ(Bharatiya Janata Party) సోమవారం ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేసింది. ఓ బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పక్కన పెట్టడాన్ని చూపిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఖర్గే సభను ఉద్దేశించి ప్రసంగిస్తారని ప్రకటన చేస్తారు.

కానీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ముందుగా  నేను మాట్లాడుతానని చెప్పి తన ప్రసంగించారు. ఆ తర్వాత ఖర్గే ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా తన సీటులో కూర్చోవడం కనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియోను బీజేపీ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో పోస్టు చేసింది. ఈ సంఘటన పార్టీని నిజంగా ఎవరు నియంత్రిస్తున్నారో బయటపెట్టిందని పేర్కొంటూ బీజేపీ కాంగ్రెస్‌ను ఎగతాళి చేసింది.

హిందీలో చేసిన ఒక పోస్ట్‌లో ఎన్నికైన పార్టీ అధ్యక్షుడి కంటే రాహుల్ గాంధీకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, కాంగ్రెస్‌లోని అధికార సమీకరణల గురించి స్పష్టమైన సందేశాన్ని పంపిందని బీజేపీ తెలిపింది. కాంగ్రెస్ ఒక ప్రజాస్వామ్య సంస్థ కాదని, అది ఒక కుటుంబ ఆస్తి అని బీజేపీ ఆరోపించింది. అక్కడ నిర్ణయాలు ఎన్నికైన నాయకుల నుండి కాకుండా ఒకే కుటుంబం నుండి వస్తాయని పేర్కొంది. కాంగ్రెస్ అధ్యక్షుడి పాత్ర కేవలం నామమాత్రపు పదవికి కుదించబడిందని, అసలైన అధికారం వేరొకరి చేతిలో ఉందని బీజేపీ పార్టీ వాదించింది.