calender_icon.png 15 December, 2025 | 3:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్ కుమార్ గోయల్ ప్రమాణ స్వీకారం

15-12-2025 12:29:53 PM

న్యూఢిల్లీ: మాజీ ఐఏఎస్ అధికారి రాజ్ కుమార్ గోయల్(Raj Kumar Goyal takes oath) సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) చేతుల మీదుగా ప్రధాన సమాచార కమిషనర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో నిరాడబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్ర సిబ్బంది శాఖ సహాయం మంత్రి జితేంద్ర సింగ్, తదితరులు హాజరయ్యారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్యానెల్ గత వారం గోయల్ పేరును సీఐసీగా సిఫార్సు చేసింది. గోయల్ అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం-కేంద్రపాలిత ప్రాంతాల (AGMUT) క్యాడర్‌కు చెందిన 1990 బ్యాచ్ (పదవీ విరమణ చేసిన) ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (Indian Administrative Service) అధికారి. ఆయన ఆగస్టు 31న కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖలోని న్యాయ విభాగం కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు.