calender_icon.png 5 August, 2025 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీలు విస్మరించి మోసానికి పాల్పడుతున్న కాంగ్రెస్ సర్కార్

05-12-2024 11:05:07 PM

భైంసా,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ  ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలను హామీల ఆశలోల నింపి అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని విస్మరించి మోసం చేస్తుందని ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం భైంసాలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా ర్యాలీ చేపట్టగా పోలీసులు అనుమతి నిరాకరించి అడ్డుకున్నారు. దీంతో బీజేపీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే రామారావుపటేల్ భైంసా రహదారిపై రాస్తారోకో చేశారు. పోలీసులు వచ్చి సర్దిచెప్పి ఆందోళన విరమింపచేశారు.

అనంతరం ఎస్‌ఎస్ జిన్నింగులో సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏడాది పాలనలో పూర్తిగా విఫలమైందన్నారు. రైతు రుణమాఫీ పూర్తిచేయలేదని, మహిళలకు నెలకు రూ.2500 ఇవ్వలేదని, రైతుభరోసా సొమ్ము ఎగ్గొడుతున్నారన్నారు. హైడ్రా, మూసీ పునరుజ్జీవం పేరుతో కాలపయాపన ప్రజలను తప్పుదోవపట్టించి పబ్బం గడుపుకొంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వైఫల్యం ఎండగట్టేందుకు ర్యాలీ నిర్వహిస్తే అనుమతి ఇవ్వకపోవడం కాంగ్రెస్ పాలనతో ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు పలుకుతున్నారన్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేవరకు తమ పార్టీ ఆందోళనలను కొనసాగిస్తుందని పునరుద్ఘాటించారు.  ఏఎంసీ మాజీ ఛైర్మన్ రాజేష్‌బాబు, నాయకులు నారాయణ్‌రెడ్డి, గోపాల్‌సార్డ కార్యకర్తలు పాల్గొన్నారు.