05-12-2024 11:14:49 PM
ఖమ్మం,(విజయక్రాంతి): కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు, ఇతర హామిల అమలులో విఫలమైందని పేర్కొంటూ బీజేపీ ఆధ్వర్యంలో ఖమ్మంలో ప్రదర్శన నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామిలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుందటూ బీజేపీ ఛార్జ్‌షీట్ విడుదల చేస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.జిల్లాకు చెందిన మంత్రులు ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల అమలులో విఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, 66 మోసాలతో ప్రజల్ని నట్టేట ముంచిందని దుయ్యబట్టారు. ఈ ర్యాలీలో బీజేపీ జాతీయ నాయకులు,తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాల సహా ఇన్చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పుల్లారావు, మంద సరస్వతి, తదితరులు పాల్గొన్నారు.