06-07-2025 10:16:56 PM
సిద్దిపేట (విజయక్రాంతి): కాలికి శాస్త్ర చికిత్స చేసుకున్న మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు(MP Madhavaneni Raghunandan Rao)ను సిద్దిపేట టూ టౌన్ బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు గందె సంతోష్ కుమార్, కోశాధికారి చంద్రశేఖర్, నాయకులు జూలూరు శివకుమార్, కుచ్చుల కరుణాకర్ లు ఆదివారం హైదరాబాదులోని ఎంపీ నివాసంలో కలిసి పరామర్శించారు. రఘునందన్ రావుకు జరిగిన శాస్త్ర చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని ప్రజాసేవలో భాగం కావాలని ఎంపీనీ కోరారు.