08-08-2025 05:38:36 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్కు గురైన కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar)ను హైదరాబాదులో దిల్ కుషా గెస్ట్ హౌస్ లో శుక్రవారం సిట్ ప్రత్యేక బృందంచే, విచారణ జరుగుతున్న సందర్భంగా కరీంనగర్ జిల్లా నుండి పెద్ద ఎత్తున బిజెపి నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. పశ్చిమ జోన్ నుండి బిజెపి నాయకులు నరహరి లక్ష్మారెడ్డి, జాడి బాల్ రెడ్డి, బోయినపల్లి ప్రవీణ్ రావు, బండ రమణారెడ్డి, తాజా మాజీ కార్పొరేటర్లు పెద్దపెల్లి జితేందర్, కొలగాని శ్రీనివాస్ ,ఆనంద్ రాపర్తి ప్రసాద్, బేతి మహేందర్ రెడ్డి, గంట్ల నరసింహారెడ్డి, మోతె గంగారెడ్డి, ఏన్నం ప్రకాష్, వాసు, రెడ్డెడ్డి శ్రీనివాస్, పోతు జగదీష్, యువ రమేష్, జోన్ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ తరలి వెళ్లారు.