calender_icon.png 8 August, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంచార్జ్ తహసీల్దార్ గా జి.చంద్రశేఖర్ బాధ్యతల స్వీకరణ..

08-08-2025 07:57:20 PM

మునగాల (విజయక్రాంతి): ప్రస్తుతం తహసీల్దార్ గా విధులు నిర్వయించిన బి. రామకృష్ణారెడ్డిని జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ప్రకారంగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బదిలీపైన వెళ్లారు. శుక్రవారం మండల ఇంచార్జ్ తహసీల్దార్ గా ఆర్డీవో ఆఫీస్ లో డీఈవోగా పనిచేస్తున్న జి. చంద్రశేఖర్ పదవి బాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రైతులు మధ్యవర్తులను సంప్రదించకుండా నేరుగా దరఖాస్తులు చేసుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. డీటీ, ఆర్ఐ. రామారావు, కార్యాలయం సిబ్బంది తహసీల్దార్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.