calender_icon.png 8 August, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవత్వం చాటుకున్న కొత్త జయపాల్ రెడ్డి

08-08-2025 07:32:09 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్(Karimnagar)లోని కొత్తపల్లి ప్రధాన రహదారి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు, ఒక బైక్ ఢీకొట్టడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ నుండి గంగాధరకు వెళ్తున్న జయపాల్ రెడ్డి ప్రమాదాన్ని చూసి వెంటనే అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ట్రాఫిక్ స్తంభించి వాహనాలు నిలిచిపోవడంతో జయపాల్ రెడ్డి స్వయంగా ట్రాఫిక్ ను క్లీయర్ చేశారు. కొత్త జయపాల్ రెడ్డి ఆపద సమయంలో సహాయం చేయడంలో ఎప్పుడు ముందుంటారని మిత్రమండలి సభ్యులు అన్నారు.