calender_icon.png 8 August, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెమ్మికల్ దండు మైసమ్మ తల్లి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం

08-08-2025 07:50:58 PM

ఆత్మకూర్ (విజయక్రాంతి): మండల పరిధిలోని నెమ్మికల్ దండు మైసమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ గా మండల కేంద్రనికి చెందిన తంగెళ్ల కర్ణాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ గా నెమ్మికల్ గ్రామానికి చెందిన ఎరకల సర్వయ్య గౌడ్ తో పాటు 13 మంది డైరెక్టర్ లు శుక్రవారం ఎండోమెంట్ అధికారి కుశలయ్య ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, కమిటీ సభ్యుల సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. నా ఎన్నికకు సహకరించిన నియోజకవర్గ ఇన్చార్జి మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, పిసిసి సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి, సూర్యాపేట మార్కెట్ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో కుశలయ్య,మండల కాంగ్రెస్ నాయకులు కొణతం ప్రతాపరెడ్డి, కాకి లక్ష్మి, తంగెళ్ళ లక్ష్మమ్మ,వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.