08-08-2025 07:53:48 PM
మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహదేవపూర్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయంలోని శుభానంద అమ్మవారి వద్ద భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సామూహిక శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలు, పూజలు నిర్వహించారు. ఈ వ్రతాలు చేసే మహిళ భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో పసుపు, కుంకుమ, గాజులు, రవికెలు, పూజా సామాగ్రి అందజేశారు.
పూజ అనంతరం అర్చక స్వాములు వేద పండితులు భక్తులందరికీ ప్రత్యేక తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వచనం చేశారు. అనంతరం మహదేవపూర్ మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలో విశ్వ హిందు పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో మహేష్, సూపరింటెంట్ శ్రీనివాస్, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు దేవరావు, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.