08-08-2025 07:48:19 PM
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలంలోని క్రాంతి విద్యాలయం(Kranthi Vidyalayam)లో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలు పాఠశాల కరస్పాండెంట్ పానుగంటి సమతా శ్రీనివాస్ అధ్యక్షతన ఆనందంగా, ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా బాలికలు తమ సహ విద్యార్థులకు రాఖీలు కట్టి రక్షణ బంధనాన్ని గుర్తు చేస్తూ సోదరత్వాన్ని చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సమత మాట్లాడుతూ, మన భారతీయ సాంప్రదాయాలలో రాఖీ పండుగకు ఎంతో ప్రాధాన్యం ఉంది ఇది సోదర, సోదరీమణుల మధ్య ప్రేమ, భద్రతకు నిదర్శనం అని మన సాంప్రదాయాలలో ఎంతో గొప్పతనం ఉందని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సోమరౌత్ శ్రీనివాసరావు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఐ. హేమ శిల్ప మరియు అధ్యాపక, అధ్యాపకేతర బృందంతో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు